Chandrayan-3: వడి వడిగా చంద్రుడి వైపు అడుగులు

స్వతంత్ర వెబ్ డెస్క్: చందమామను చేరుకోవడానికి, దాని గుట్టు తెలుసుకునేందుకు భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి చేరువచేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు విజయవంతంగా కక్ష్య పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3ని ఐదో కక్ష్యలోకి చేర్చే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది.
ప్రస్తుతం భూమికి 71351 x 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌.. ఇక ఐదో దశ కక్ష్య పెంపు సక్సెస్‌ కావడంతో భూమికి 1,27,609 x 236 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలోకి చేరనుందని అంచనా వేస్తున్నారు. భూమి చుట్టూ తిరిగే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇదే చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక ఆగస్టు 1వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు 1వ తేదీ రాత్రి 12 నుంచి ఒంటిగంట మధ్యలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.
జులై 14న చంద్రయాన్‌-3ను LVM3-M4 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత 15న తొలి సారి, 16న రెండో సారి, 18న మూడో సారి , 20న నాలుగో సారి , 25న ఐదో సారి కక్ష్య పెంపు ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్