పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్, స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. ఈ సందర్భంగా ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్ధాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయలు, చెరువుల్లో అయితే వేశమో ఆ వ్యర్ధాలను అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్ధాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన
0
283
Next article
Latest Articles
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
- Advertisement -
- Advertisement -


