బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆటో కార్మికుల పైన బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ హాయాంలో ఆటో డ్రైవర్లకు చేసిందేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఏడాదికి 12వేలు ఇస్తామని చెప్పామని… తమ నిర్వాకం వల్ల ఆర్థిక సంక్షోభంతో ఇవ్వలేకపోయామని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్‌లో ఆటో కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.