రేవంత్ సర్కార్‌పై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. శాసన మండలిలో తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధాలు ఇస్తోం దని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు అంశంలో అబద్ధాలు చెప్పడం ఎందుకు… ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు.. కానీ, సెప్టెంబర్ 2024లో ప్రపంచ బ్యాంకు నుంచి ఋణం అడిగినట్టుగా తన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కవిత. అయితే.. అసెంబ్లీలో డీపీఆర్ లేనట్టు చెప్పిన మంత్రి, సెప్టెంబర్ 19 న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెబుతున్నారని ఆరోపించారు.