తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్‌తో గందరగోళం నెలకొంది. రోడ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మామ చాటు అల్లుడివి.. 10 కోట్లు దోచుకున్న దొంగవి అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావుపైతీవ్ర విమర్శలు చేశారు మినిస్టర్ కోమటిరెడ్డి. ఈ వ్యాఖ్యలతో కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్‌రావు.. అసెంబ్లీ బయట డ్రంకన్ డ్రైవ్ చెప్పాల్సిన అవసరముందని సెటైర్లు వేశారు.
కొందరు పొద్దున్నే తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్‌రావు చేసిన ఈ కామెంట్స్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అభ్యంతరం చెబుతూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తగవని మండిపడ్డారు. సభనే కాదు సమసమాజం తల దించుకునేలా మాట్లాడారని విమర్శించారు.