మమతా బెనర్జీ, టీఎంసీని వీడేది లేదు.. శతృఘ్న సిన్హా

ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు.. ఆ తర్వాత మమతా బెనర్జీ( Mamata Banerjee) పట్ల తన విధేయతను ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా(Shatrughan Sinha).తాను తృణమూల్ కాంగ్రెస్‌లోని తిరుగుబాటు వర్గంలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను శత్రుఘ్న సిన్హా గురువారం కొట్టిపారేశారు.

ఓ వైపు లోక్‌సభ స్పీకర్‌కు తృణమూల్ తిరుగుబాటు వర్గం సమర్పించిన లేఖపై సంతకం చేసిన వారిలో శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నేతగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ శత్రుఘ్న సిన్హా చేసిన ఎక్స్ పోస్ట్ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపింది. దీంతో ఆయన కూడా టీఎంసీని వీడతారనే  ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలు ఖండించిన ఆయన.. తాను మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పట్ల పూర్తి విధేయతతోనే ఉన్నానని స్పష్టం చేశారు.

శతృఘ్న సిన్హా తదుపరి అడుగు ఏమిటన్న చర్చ జరుగుతున్న వేళ…నటుడు, రాజకీయ నేత అయిన ఆయన.. తాను మమతా బెనర్జీని, ఆమె నాయకత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ను వీడనని క్లారిటీ ఇచ్చారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్