పెరిగిన భూముల విలువతో ప్రజలు అల్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పేద ధనిక అన్న తేడా లేకుండా అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీశ్‌రావు.. ” దొడ్డి దారిన అన్ని చార్జీలు పెంచారు. పెరిగిన పెట్రోల్ ధరలతో ఏడాదికి రూ.2 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. భూమి శిస్తు తెస్తామని ఓ మంత్రి చెబుతున్నాడు. ఫ్యూచర్ సిటీ ఆయా గ్రామాలకు శాపంగా మారుతుంది. ఇక్కడ ఇల్లు కట్టుకునే వారిపై భారం పడుతుంది. అడిషనల్ ఇంపాక్ట్ ఫీజు పెడతామని చెప్పి పది వేల కోట్ల అప్పు తెచ్చారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి రాష్ట్రానికి అప్పులు తెస్తున్నారు. వేల కోట్లు అప్పులు తేవడానికి బాంబే బ్రోకర్లకు వందల కోట్ల కమీషన్లు రేవంత్ రెడ్డి ముట్టచెప్పాడు. బిఆర్ఎస్ చెల్లని నోటు అయితే రేవంత్ రెడ్డి పదే పదే మమ్మల్ని ఎందుకు కలవరిస్తున్నాడు. త్వరలోనే రేవంత్ రెడ్డి చెల్లని నోటు కాబోతున్నాడు. ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తాం. ఫార్మా సిటీపై కాంగ్రెస్ కు ఓ విధానమే లేదు. ఫార్మా సిటీ కోసం మేము ఎంతో కష్టపడి కేంద్రం నుంచి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తెచ్చాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో బంధు మిత్రులకు భూములు కట్టబెట్టాలనుకుంటే మేము ఒప్పుకోం. ఫార్మా సిటీలో నేను కూడా భూమి కోల్పోయాను. 17 ఎకరాలు 8 లక్షల చొప్పున ప్రభుత్వానికి ఇచ్చాను. జర్నలిస్టుల కోసం కేసీఆర్ చేసినంత ఎవరు చేయలేరు. రాష్ట్రంలో జిల్లాల్లో 90 శాతం జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చాం. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డికి నిజమైన ప్రేమ లేదు. వందల ఎకరాలు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి.. కిరికిరి లేని ల్యాండ్స్ జర్నలిస్టులకు ఇవ్వండి. మేము స్వాగతిస్తాం. గతంలో ఇచ్చిన భూమి జర్నలిస్టులకు ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి “… అని అన్నారు.
త్వరలోనే రేవంత్ రెడ్డి చెల్లని నోటు కాబోతున్నారు- హరీశ్ రావు
0
8
Previous article
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


