బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీశ్ వేసుకోలేదని అన్నారు. కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని విమర్శించారు. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదని అన్నారామె. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని ఫైరయ్యారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం 10సార్లు బేడీలు వేశారని ఆరోపించారు. కనీసం అప్పుడు అధికారులపై చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు బేడీలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు మంత్రి సీతక్క.