కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు.
——-
కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్‌కు వివరించారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో10లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని అంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన మంత్రి నారా లోకేష్
Latest Articles
- Advertisement -