వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కలిశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్‌కు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. నందిగం సురేష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం ఏమైతే అక్రమ కేసులు పెట్టిందో వాటిని ధైర్యంగా ఎదుర్కొందామన్నారు.