స్వతంత్ర వెబ్ డెస్క్: MIM అభ్యర్థులు లేని చోట..BRS పార్టీకి ఓటు వేయండని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి పిలుపునిచ్చారు. మా అభ్యర్థులు నిల్చున్న చోట ఎంఐఎంకి వోట్ వెయ్యండి.. మా అభ్యర్థులు నిలబడని చోట బీఆర్ఎస్ పార్టీకి వోట్ వేసి కేసీఆర్‌ని మూడోసారి సీఎంని చేయండని కోరారు అసదుద్దీన్ ఒవైసి. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అబివృద్ది చూసి కళ్ళు తెరుచుకుంటాయన్నారు అసదుద్దీన్ ఒవైసి.
40 ఏళ్ళు అధికారంలో ఉండి అమేథీని ఎంత అబివృద్ది చేసుకున్నారు? అని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 9 ఏళ్లలో తెలంగాణ అమేథీ కంటే ఎక్కువ అబివృద్ది చెందిందన్నారు… రాహుల్ గాంధీ పర్యటనలో కాళేశ్వరం నీళ్లు, నీళ్లతో కాలువలు, పైప్‌లలొ నీళ్లు కనిపిస్తాయి, అభివృద్ది కనిపిస్తదని చురకలు అంటించారు అసదుద్దీన్ ఒవైసి. మొత్తానికి MIM అభ్యర్థులు లేని చోట..BRS పార్టీకి ఓటు వేయండని తెలంగాణ ముస్లింలకు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి పిలుపునిచ్చారు.