Akula Lalitha: బీఆర్‌ఎస్‌ కు షాక్.. పార్టీని వీడిన మరో కీలక నేత

స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా విమర్శించారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్