స్వతంత్ర వెబ్ డెస్క్: బీహార్ లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులు పడడంతో ఒక్క మంగళవారం రోజే 32 మంది మృత్యువాత పడ్డారు. 14 జిల్లాల పరిధిలో పిడుగుపాటు మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బీహార్ లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇవాళ ఈశాన్య, నైరుతి బీహార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పిడుగుల బీభత్సం.. ఒక్కరోజులో 32మంది మృతి
0
328
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


