స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మొదటి దశ వారాహి విజయ యాత్ర విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో ఈ యాత్ర ముగియగా.. రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించనున్నారు.
జులై 9న నుంచి వారాహి విజయ యాత్ర రెండో దశ
0
325
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


