స్వతంత్ర వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్‌మెంట్‌లో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో పిల్లలతో సహా 16మంది చనిపోయారు. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో 16 మంది చనిపోయారని అధికారులు నిర్ధారించారు. పారామెడిక్స్ జోక్యంతో మరికొందరిని గుర్తించాం.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారని అత్యవసర సేవల అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నా.. ప్రస్తుతం స్టేబుల్ గా ఉందని వాళ్లు పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి గ్యాస్ పేలుడు జరిగిందని కాల్ వచ్చింది.. అక్కడికి వెళ్లి చూసేసరికి విషపూరిత వాయువు ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్‌ను అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా ఉపయోగిస్తున్నట్లు వాళ్లు తెలిపారు.