రాజ్ తరుణ్ – లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు మరోసారి వెళ్లిన లావణ్య.. బిగ్‌బాస్ ఫేం ఆర్‌జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య చెబుతోంది. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియోలను పోలీసులకు అందించింది లావణ్య.