ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి హస్తినకు చేరుకోనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు లోకేశ్.
రైల్వే వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి నిధులు కేటాయించినందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపి సన్మానించనున్నారు మంత్రి లోకేశ్. అదేవిధంగా రాష్ట్రానికి కొత్తగా రావాల్సిన రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలుపనున్నారు. విశాఖపట్నంను IT హబ్‌గా, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రోత్సహకాలు అందించాలని అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేయనున్నారు.