తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మంగళవారం జరుగుతున్నాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగిందని చెప్పారు.
రాష్ట్రంలో బీసీల జనాభా- కోటి 64 లక్షల 9 వేలు
రాష్ట్ర జనాభాలో బీసీలు- 46.25 శాతం
ఎస్సీల జనాభా – 61 లక్షల 84వేల 319 మంది
జనాభాలో ఎస్సీలు- 17.43 శాతం
రాష్ట్రంలో ఎస్టీలు – 37 లక్షల 5వేల 929 మంది
మొత్తం ఎస్టీలు జనాభాలో 10.45 శాతం
బీసీ మైనార్జీ ముస్లింలు 35 లక్షల 76వేల 588 మంది
ముస్లిం మైనార్జీలు బీసీలు సహా మొత్తం జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం కోటి 12 లక్షల కుటుంబల వివరాలు కులగణన సర్వేలో సేకరించామని అన్నారు. 96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని వివరించారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయన్నారు. ఏడాది క్రితం ఈ సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని.. సరిగ్గా ఏడాది తర్వాత సర్వే నిర్వహించి నివేదికను అసెంబ్లీ ముందు ఉంచామని అన్నారు.