కాకినాడ సెజ్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. కాకినాడ సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు కాకినాడ సీ పోర్టు,.కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌ల్లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను తన నుంచి లాగేసుకున్నారని ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించి ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే తాను పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేనని విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చారు. దీంతో మళ్లీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.