ఎలక్టోరల్‌ బాండ్ల వివాదం.. అవినీతి ఎలా అంటారు?- కేటీఆర్‌

ఈ ఫార్ములా ఈ రేసు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈకేసులో ఎలక్టోరల్ బాండు వివాదం తెరపైకి వచ్చింది. ఫార్ములా రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్ కో కంపెనీ రూ.49 కోట్లు చెల్లించింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చారు. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండే గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది..

2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో కంపెనీ. మొత్తం మీద రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చెల్లించింది గ్రీన్ కో సంస్థ.

ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. 2022లో గ్రీన్ కో సంస్థఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని.. 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌ కో బాండ్లు ఇచ్చిందన్నారు. రేసు కారణంగా నష్టపోయింది గ్రీన్ కో కంపెనీనేనని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అంటారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్