24.7 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

నిజం చెప్పినందుకు జైలు… ఎట్టకేలకు విముక్తి

  యాభై రెండేళ్ల జూలియన్ అసాంజే జీవితమంతా పోరాటమే. అనునిత్యం వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. ఏళ్ల తరబడి అనేక దేశాలతో జర్నలిస్టు వృత్తిలో భాగంగా అసాంజే పోరాటాలు చేశారు. ఈ పోరాటాల్లో అనేకసార్లు అసాంజే విజయాలు సాధించారు. అయితే ఈ విజయాలతో ఆయన ఎంతో మందికి కంటగింపుగా మారారు.

2007లో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను 2010 ఏప్రిల్‌లో వికీలీక్స్ బయట పెట్టింది. ఇదొక్కటే కాదు ఇరాక్ యుద్దాన్ని వివరించే నాలుగు లక్షలకుపైగా రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ సంస్థ బయటపెట్టింది. ఇది 2010 అక్టోబరులో జరిగింది. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. తనను స్వీడన్‌ కు అప్పగించడానికి ఈక్వెడార్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఏడేళ్లపాటు తలదాచుకు న్నారు. ఈ సమయంలోనే అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2010లో వికీలీక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. వివిధ దేశాలకు చెందిన 91 వేలకుపైగా రహస్య పత్రాలను విడుదల చేసింది. దీంతో భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచ హీరోగా అసాంజే జేజేలు అందుకున్నారు. మిగతా దేశాల సంగతి ఎలాగున్నా అమెరికాకు మాత్రం అసాంజే శత్రువుగా తయారయ్యాడు. ముఖ్యంగా ఇరాక్‌, అఫ్గనిస్థాన్‌ యుద్ధాలకు సంబంధించిన సైనిక రహస్యాలను ఆయన స్థాపించిన వికీలీక్స్‌ విడుదల చేసింది.

అమెరికా ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు సహా అనేక రహస్య పత్రాలను ఆయన ప్రపంచానికి వెల్లడిం చారు. దీంతో అసాంజే సంచలనకారుడయ్యారు. అప్పటినుంచి ప్రపంచమంతా జూలియన్ అసాంజే పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో జూలియన్ అసాంజే ఒక స్వేచ్ఛా జీవి అని వికీలీక్స్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ కామెంట్‌కు ఒక విమానం కిటికీ నుంచి బయటకు చూస్తున్న అసాంజే ఫొటోను వికీలీక్స్ సంస్థ జత చేసింది. 2006లో జూలియన్ అసాంజే వికీలీక్స్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధాల సందర్భంగా అమెరికా మిలటరీ రహస్య సమాచారాలను తన వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. 2010లో స్విట్జర్లాండ్‌ అధికారులు ఆయనపై రేప్‌ అభియోగాల తో అరెస్టు వారెంటు జారీ చేశారు. ఆ ఆరోపణలను అసాంజే తిరస్కరించారు. తన అరెస్టును తప్పించుకునేందుకు 2012 నుంచి ఏడేళ్లపాటు లండన్‌లోని ఈక్వెడార్‌ ఎంబసీలో తలదాచుకున్నారు. ఈ ఆరోపణల్లో తనను అరెస్టు చేస్తే, రహస్య పత్రాలు బయటపెట్టిన కేసులో తనను అమెరికాకు తరలిస్తారని భావించి, ఇక్కడ ఉన్నారు. అయితే తదుపరి ఆ కేసును స్వీడిష్‌ అధికారులు విడిచిపెట్టారు. 2019లో ఈక్వెడారియన్‌ ఎంబసీ ఆయనను బహిష్కరించింది. అప్పటి నుంచి బ్రిటన్‌లోని బెల్మార్ష్‌ జైల్లో ఆయన గడిపారు. ఆ మరుసటి సంవత్సరం కీలక పత్రాలను బహిరంగం చేయడంపై అమెరికా న్యాయశాఖ అసాంజేపై అభియోగాలు మోపింది.

వికీలీక్స్ ఈ సంస్థను 2006లో జూలియన్ అసాంజే స్థాపించారు. వికీలీక్స్  ప్రజా విరాళాల ద్వారా నడిచే సంస్థ అంటారు అసాంజే. అంతేకాదు వికీలీక్స్ ను లాభాపేక్షలేని సంస్థగా అసాంజే అనేకసార్లు పేర్కొ న్నారు. వికీలీక్స్ తన మానస పుత్రికగా అభివర్ణించారు జూలియన్ అసాంజే. ప్రపంచంలో వెలుగుచూడని అనేక చీకటి రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టిందంటారు అసాంజే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా దోపిడీకి, పీడనకు గురైన వారికి సంబంధిం చిన ఓ అతి పెద్ద లైబ్రరీ యే వికీలీక్స్ అని 2015లో జర్మన్ పత్రిక డెర్ స్పీగెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసాంజే పేర్కొన్నారు. వృత్తిలో భాగంగా తమకు అందిన సమాచారాన్ని హేతుబద్దంగా తాము విశ్లేషిస్తామన్నారు ఆయన. అంతేకాదు బాధితు లకు న్యాయం జరుగుతుందంటే సదరు సమాచారాన్ని ప్రమోట్ చేయడానికి కూడా తాము వెనుకాడేది లేదని అసాంజే కుండబద్దలు కొట్టారు.

వికీలీక్స్ అనేక దేశాలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికాకు డొనాల్‌ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసాంజేపై సర్కార్ మండిపడింది. గూఢచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అసాంజ్ మీద 2019లో దాదాపు ఇరవై అభియోగాలు మోపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఆర్మీ ఇంటలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్ తో కలిసి అసాంజే కుట్రపన్నారని అమెరికా న్యాయవాదులు వాదించారు. ఇందుకు సంబంధించి చెల్సియా మానింగ్ కు ఏడేళ్లు జైలు శిక్ష విధించారు. 2017లో అమెరికా అధ్యక్షుడు ఒబామా శిక్షను తగ్గించడంతో చెల్సియా మానింగ్ విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అసాంజ్‌పై క్రిమినల్ అభియోగాలు మోపడం భావ ప్రకటనా స్వేచ్చకు ముప్పు అని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలపై సంచలన కథనాలను బయటపెట్టినందునే అసాంజ్‌పై అభియోగాలు మోపిన ట్టుగా వికీలీక్స్ తెలిపింది.2000ల నుంచి వికీలీక్స్ ద్వారా అత్యంత వివాదాస్పదమైన లీక్‌లు రావడం ప్రారంభమైంది. అమెరికా కస్టడీలో ఖైదీలు అనుభవించిన దారుణ పరిస్థితులు, అలాగే మానవ హక్కుల ఉల్లంఘనలను వికీలీక్స్ సంస్థ హైలెట్ చేసింది. వికీలీక్స్ సంస్థ ఏది బయటపెట్టినా అది సంచలనమే.

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్