24.7 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

నిజం బతికింది ….విముక్తి దొరికింది

   వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కొంతకాలంగా అసాంజే గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇన్నాళ్లూ బ్రిటన్‌లో జూలియన్ అసాంజే తలదాచుకున్నా రు. బ్రిటన్‌లోని బెల్మార్ష్ జైలులో అసాంజే ఐదేళ్ల పాటు గడిపారు. అంత‌కుముందు అసాంజే ఈక్వ‌డార్ ఎంబ‌సీలో ఏడేళ్లు గ‌డిపారు. అయితే ఆయనను విడిచిపెట్టాలని ఇటీవల అమెరికా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అమెరికా న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. విముక్తి లభించడంతో అసాంజేకు అదనపు జైలు శిక్ష ఉండదు. కాగా అసాంజే కు విముక్తి లభించడం పట్ల ఆయ‌న భార్య స్టెల్లా సంతోషం వ్య‌క్తం చేశారు.

  అసాంజేకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వివిధ సంస్థలు, పత్రికా స్వేచ్ఛను ప్రచారం చేసేవా రు, చట్టసభల సభ్యులు, నాయకులు, ఐక్యరాజ్యసమితి వరకు చేసిన కృషి కారణంగా అసాంజే విముక్తి సాధ్యమైందని వికీలీక్స్ తన సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ కృషి కారణంగానే అమెరికా న్యాయశాఖతో సంప్రదింపులకు అవకాశం కలిగింది. విముక్తి లభించడంతో ప్రత్యేక విమానంలో జూలియన్ అసాంజే ఆస్ట్రేలియ బయల్దేరారు. అంతకు ముందు అమెరికా న్యాయ విభాగం తో అసాంజే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకు తనపై వచ్చిన కొన్ని నేరారోపణలకు సంబంధించి అసాంజే కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. గూఢచర్యం చట్టానికి విరుద్దంగా జాతీయ భద్రతకు సంబంధిం చిన కీలక సమాచారాన్ని పొందడం, సదరు సమాచారాన్ని బయటి ప్రపంచానికి అందివ్వడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానంలో అసాంజే అంగీకరించారు.

   జూలియన్ అసాంజే విచారణ మొత్తం మూడు గంటలపాటు సాగింది.ఈ విచారణ సందర్భంగా అసాంజే అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని తాను నమ్ముతు న్నానని విచారణ సందర్భంగా అసాంజే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా తన చర్యలను అసాంజే సమర్థించుకున్నట్లయింది. ఒక జర్నలిస్టుగా తాను చిత్తశుద్దితో పనిచేసినట్లు అసాంజే పేర్కొ న్నారు. వృత్తిలో భాగంగా రహస్య పత్రాలను సేకరించాన న్నారు. అంతేకాదు సేకరించిన సమాచారా న్ని ప్రచురించినట్లు కూడా అసాంజే పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్చలో భాగంగానే తాను ఈ పనులు చేసినట్లు అసాంజే వెల్లడించారు. అయితే తాను చేసిన పని, గూఢచర్య చట్టానికి విరుద్దమన్న సంగతి తాను అంగీకరిస్తున్నట్లు అసాంజే పేర్కొన్నారు. నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అసాంజే చేసిన ప్రకటన కు కేసు విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమొనా వి. మంగ్లోనా ఆమోదం తెలిపారు. ఇంత కాలం బ్రిటన్‌లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలియన్ అసాంజేను విడుదల చేస్తున్నట్లు న్యాయమూర్తి మంగ్లోనా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన ఉత్తర మారియానా ద్వీపం రాజధాని అయిన సైపస్‌లో ఉన్న న్యాయస్థానంలో అసాంజే విచారణ జరిగింది. తనపై వచ్చిన నేరాభియోగాల విచారణకు అమెరికా వెళ్లడానికి అసాంజే నిరాకరించారు. దీంతో సైపస్‌లో ఉన్న కోర్టులోనే విచారణకు అమెరికా సమ్మతించింది. అంతేకాదు అమెరికా ఆధీనంలో ఉండే ఈ భూభాగం ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉంటుంది.

   అమెరికా కోర్టు విముక్తి ప్రసాదించడంతో బ్రిటన్‌, అమెరికాలోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్‌ బెర్రాకు అసాంజే బయల్దేరారు. ఇదిలా ఉంటే అమెరికా న్యాయ విభాగం, జూలియన్ అసాంజే మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్వాగతించారు.అసాంజేకు శిక్ష నుంచి విముక్తి కల్పించడం అనేది చాలా సున్నితమైన అంశమని అల్బనీస్ పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని అల్బనీస్ పేర్కొన్నారు. అయితే అసాంజే కేసు సానుకూలంగా ఒక కొలిక్కి రావాలని తాను ప్రయత్నించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ వెల్లడించారు. అసాంజేను మరింతకాలం బందీగా ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Articles

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్