ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. ఆ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.