Minister KTR |టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్‌పీఎస్‌సీ పనిచేస్తోందని అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టసవరణ చేశామన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనని అన్నారు.
రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దని అన్నారు కేటీఆర్(Minister KTR ). కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని అన్నారు, ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. లక్షలమంది పిల్లలకు ఇబ్బంది కలగకూడదని.. ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. దేశంలో ఎవరూ చేయనంత వేగంగా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పొరపాటు వల్ల వచ్చిన తప్పిదాలు మరోసారి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఫీజు చెల్లించినందువల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదని వెల్లడించారు.
Read Also: శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Follow us on: Youtube Instagram