ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో తనదైన పాలనతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్ని స్వంతం చేసుకున్న సీఎం.. కాస్త అసంతృప్తులుగా ఉన్న ప్రజలను కూడా సంతృప్తి పరిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వంద శాతం మెజారిటీ సాదించేందుకు పావులు కదుపుతున్నారు. ఈసారి ఒక్క ఓటు కూడా వృథా కాకుండా జాగ్రత్త తీసుకుంటున్న వైసీపీ.. ఒక్కో మంత్రికి 20 మంది ఎమ్మెల్యేలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్ హాల్ లో ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
20 MLAs per Minister