CM KCR Survey |అధికార బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు ఆయా నియోజకవర్గాల్లో ఎలావుంది అని తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రతి మూడు మాసాలకొకసారి నిఘావర్గాలతో పాటు ఆయా సంస్థలతో సర్వే నిర్వహిస్తారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా శాసనసభ్యుల పనితీరును మార్చుకోవాలని పలు సూచనలు చేస్తారు. తాజాగా, బీఆర్ఎస్ నాయకులపై నిర్వహించిన సర్వే వివరాలు సీఎం కేసీఆర్ కు చేరినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నలుగురు మంత్రులతో పాటు.. 22 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఎంత మాత్రం అందుబాటులో ఉండడం లేదని.. వీరు హైదరాబాద్ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ వారం పదిరోజులకు ఒకసారి నియోజక వర్గానికి వస్తున్నట్టు నివేదికలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
CM KCR Survey |అయితే దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లను బీఆర్ఎస్ కొల్లగొట్టాలని చూస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేదం చేయాడానికి.. పట్టు కోల్పోయిన నియోజక వర్గాల్లో మళ్ళీ పట్టు సాధించడానికి 25 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని స్వయంగా కేసీఆర్ రూపొందించి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక చివరిసారిగా ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరికలు జారీ చేయాలని BRS అధిష్టానం భావిస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిపే తాజా సమాచార సేకరణలో మళ్ళీ ఇలాంటి ఫలితాలు వస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ల ఇవ్వకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: వీటీపీఎస్ లో కూలిన లిఫ్ట్.. ఇద్దరు స్పాట్ మృతి
Follow us on: Youtube Instagram