స్వతంత్ర వెబ్ డెస్క్: మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విజయవాడలో నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పదో తరగతిలో 42 మంది రాష్ట్రస్థాయి టాపర్లు, 26 మంది ఇంటర్ విద్యార్థులకు స్వయంగా అవార్డులను అందజేసి, సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందికి స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులను సీఎం అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయుల్లో ప్రతిభ చాటిన 22,710 మంది ఆణిముత్యాల అవార్డులను మంగళవారం అందుకున్నారు. విద్యార్థులను సన్మానించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. కరిక్యులమ్ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం. విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారాయన.
జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారంపాటు సత్కారాలు నిర్వహించనున్నారు. పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంకర్‌కు లక్ష. ద్వితీయ ర్యాంక్ రూ.75 వేలు, తృతీయ ర్యాంక్‌కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 42 మందిని ఎంపిక చేసి అందిస్తారు. ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు.