మణికొండలోని జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ మణికొండలోని జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్కూల్ లోని మొదటి అంతస్థులోని ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు వ్యాపంచాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను పాఠశాల నుంచి బయటికి పంపించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఎలాంటి హాని జరగలేదని ప్లే స్కూల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జొల్లి కిడ్స్ ప్లే స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకుని వారి పిల్లల భద్రతపై ఆరా తీశారు.

ఈ ప్రమాదంలో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. తరగతి గదిలోని ఏసీ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారులు ఉపయోగించే పలు బొమ్మలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్