Free Porn
xbporn
23.7 C
Hyderabad
Friday, July 19, 2024
spot_img

మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ హిట్టేనా ?

  ప్రధాని హోదాలో దేశ సమస్యలను పరిష్కరించడం నరేంద్ర మోడీ బాధ్యత. సమస్యల పరిష్కారం సందర్భంగా నరేంద్ర మోడీ మనసులో అనేక ఆలోచనలు మెదులుతుంటాయి. ఇందులో అనేక నిర్మాణా త్మక ఆలోచనలుంటాయి. ఈ ఆలోచనలను ప్రజలతో పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ డిసైడ్ అయ్యారు. దీనికి ఒక వేదిక కావాలనుకున్నారు. ఆ ఆలోచనే చివరకు మన్ కీ బాత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

  మన్ కీ బాత్  దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని కార్యక్రమం. ఇదొక వినూత్న కార్యక్రమం. అంతేకాదు మన్ కీ బాత్.  ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రిక. తాజాగా మన్‌ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభ మైంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉండటంతో మన్‌ కీ బాత్ కార్యక్రమాన్ని కొన్ని నెలల కిందట నిలిపివేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరోసారి మన్‌ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. తాజాగా ప్రారంభమైంది నూట పదకొండో ఎపిసోడ్. ఈ కార్యక్రమంలో అనేక అంశాలపై న తమ భావాలను ప్రజలతో పంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత నరేంద్ర మోడీ పాల్గొన్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇదే కావడం విశేషం. మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌లో అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తా వించారు. ఈసందర్భంగా ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ వివరించారు. అంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని పెద్ద మొత్తంలో పండిస్తారన్న విషయాన్ని ప్రధాని వెల్లడిం చారు. మంచి రుచికి, సువాసనకు అరకు కాఫీ పెట్టింది పేరన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే అరకు కాఫీకి వచ్చినట్లు స్థానిక ఉత్పత్తులకు ప్రజాదరణ మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రత్యేక రకమైన గొడుగుల గురించి కూడా నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఈ గొడుగులు దక్షిణాది రాష్ట్ర మైన కేరళలో తయారవుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు ఆయన. ఈ సందర్భంగా కేరళలోని కుర్తుంబీ గొడుగుల గురించి ఆయన దేశ ప్రజలకు వివరించారు. కేరళలోని అట్టప్పాడిలో ఈ ప్రత్యేక గొడుగులను తయారు చేస్తారని తెలియ చేశారు.

  మన్ కీ బాత్ కార్యక్రమంలో తాజా లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. కాగా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియా విజయం సాధించడాన్ని మన్ కీ బాత్‌ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పదిహేడు సంవత్సరాల తరువాత టీ ట్వంటీ ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుందన్నారు. ఇది దేశ ప్రజలందరూ గర్వించదగ్గ చరిత్రాత్మక విజయమన్నారాయన. ఈ సందర్భంగా భారత జట్టుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాను చూసి తాను గర్వపడుతున్నాన న్నారు. అదే విధంగా క్రీడారంగానికి కూడా తాజా మన్ కీ బాత్ కార్యక్రమంలో సముచిత ప్రాధాన్యం ఇచ్చారు నరేంద్ర మోడీ. త్వరలో జరిగే ఒలింపిక్స్ గురించి ఆయన ప్రస్తావించారు.ఈ ఒలింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు సత్తా చాటతారని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. చీర్ ఫోర్ భారత్ అనే హ్యాష్ ట్యాగ్‌తో భారత అథ్లెట్లను దేశ ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపిచ్చారు.ప్రజల అంచనాలకు తగ్గట్లు ఒలిపింక్స్ లో పతకాలు సాధించడానికి భారత క్రీడాకారులు సర్వసన్నద్ధంగా ఉన్నారన్నారు.కాగా ఇటీవల నిర్వహించుకున్న యోగా దినోత్సవం ప్రాధాన్యం గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. మనిషి దైనందిన జీవితంలో యోగాకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఇటీవల ప్రపంచ మంతా యోగా దినోత్స వాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుందన్నారు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గుర్తు చేసుకు న్నారు.

  మన్ కీ బాత్‌ కార్యక్రమంలో పర్యావరణానికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత విలువైన సంపద పర్యావరణమే అన్నారాయన. పర్యావరణ దినోత్సవం సందర్భం గా ఏక్ పేడ్‌ మా కే నామ్  అనే పేరుతో తమ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా తన మాతృమూర్తి పేరుతో తాను ఒక మొక్క నాటిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం వింటున్న వారందరూ తమ తల్లుల పేరుతో మొక్కలు నాటాలని ఆయన కోరారు. జన్మనిచ్చిన తల్లిని చూసుకున్నట్లు భూమి తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వృక్షొ రక్షతి …రక్షితహ….అనే సూక్తిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. రుతుపవనాల రాక గురించి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రుతుపవనాలు రావడంతో రైతులోకం ఎంతో ఆనందిస్తోందన్నారు. వ్యవసాయానికి సరి పడ వానలు కురిసి ఇబ్బడి మబ్బడిగా ఉత్పత్తులు పెరగాలని తాను కోరుకుంటున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా నరేంద్ర మోడీ వివరించారు.

 ఆదివాసీలు హల్ దివస్‌ గా జరుపుకునే రోజునే మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే జూన్ 30 వ తేదీకి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉందన్నారు. బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా గర్జించిన ఆదివాసీ వీరుడు సిద్దో కన్హు జయంతి అన్నారు. వేలాది మంది సంతాల్ తెగ వీరులను ఏకం చేసి బ్రిటన్ పాలకులకు వ్యతి రేకంగా సిద్దో కన్హు పోరాటం చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే బ్రిటిష్ పాలకులు రూపొం దించిన వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా సంతాల్ తెగ ప్రజలు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.మన్ కీ బాత్ నూట పదకొండో ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు మరోసారి రావడం నాకెంతో ఆనందంగా ఉందంటూ తాజా కార్యక్రమాన్ని ప్రారంభించారు నరేంద్ర మోడీ. వరుసగా మూడో సారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ముందుగా దేశ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. దేశంలో మార్పు తీసుకురావడానికి తాము చేస్తున్న కృషిని మెచ్చి తమకు హ్యాట్రిక్ అవకాశం ఇచ్చారన్నారు నరేంద్ర మోడీ.

  ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయినప్పటికీ, సదరు కార్యక్రమం లక్ష్యం మాత్రం కొనసాగుతోందన్నారు ఆయన. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలను, యావత్ ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 65 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు వినియోగించుకున్నార న్నారు. ఎన్నికల నిర్వహణ అనేది కత్తిమీద సాము అన్నారు మోడీ. కత్తిమీద సాములాంటి ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రతిభావంతంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిందన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తాను అభినందిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మొత్తానికి కొన్ని నెలలపాటు నిలిచిపోయిన మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Latest Articles

రిలీజ్ డేట్ మార్చుకున్న ‘ఆపరేషన్ రావణ్’

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్