ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక మన్ కీ బాత్ కార్యక్రమం. కిందటేడాది ఏప్రిల్ నెలలో ఢిల్లీలో మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ అత్యంత వైభవంగా జరిగింది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 2014 అక్టోబరు మూడో తేదీన చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపు కునే విజయదశమి పండుగ రోజున తొలి మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రారంభమైన సంగతిని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కు సినీతారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మన్ కీ బాత్ కార్యక్రమం ఇప్పటిది కాదు. పదేళ్ల నుంచి ఈ వినూత్న కార్యక్రమం నడుస్తోంది. 2014 అక్టోబరు మూడో తేదీన విజయదశమి పండుగ రోజున మన్ కీ బాత్ పేరుతో ఓ వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే రోజున ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం చాలా తక్కువ సమయంలోనే జనాద రణ పొందింది. మన్ కీ బాత్ ప్రస్థానంలో అనేక ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే వందో ఎపిసోడ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. కిందటేడాది ఏప్రిల్ 30న ఢిల్లీలో మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగిన వందో ఎపిసోడ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ తన మనసు విప్పారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వివిధ రంగాలకు చెందిన మనదేశ ప్రము ఖుల గురించి తెలుసుకోవడానికి మన్ కీ బాత్ తనకు ఒక వేదికలా ఉపయోగపడింద న్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే భారతదేశ కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన మహనీయుల గురించి వివరించే అవకాశం మన్ కీ బాత్ తనకు కల్పించిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
మన్ కీ బాత్ కార్యక్రమం అందరి అంచనాలను మించి విజయవంతమయింది. ఇదే విషయాన్ని వందో ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా నరేంద్ర మోడీ ప్రస్తావించారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాను కూడా భావించలేదున్నారు ఆయన. మన్ కీ బాత్ సక్సెస్ కావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అనేక అంశాలపై తన మనస్సులోని భావాలను ప్రజలతో పంచుకోవడానికి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికలా ఉపయోగపడిందన్నా రాయన. అంతేకాదు రాజకీయాలకతీతంగా సామాన్య ప్రజలతో చేరువ అయ్యే అవకాశాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం తనకు కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందన్నారు. ప్రతినెలా వందలు, వేల సంఖ్యలో ప్రజల నుంచి తనకు సందేశాలు వచ్చాయన్నారు నరేంద్ర మోడీ. సదరు సందేశాలను ఓపికగా తాను చదివిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమం వేదికగా దేశ ప్రజలతో తాను అనేక విషయాలు ముచ్చటించానని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో పేదల సమస్యల నుంచి సామాన్యుడి విజయాల వరకు ఉన్నాయ న్నారు. వీటన్నిటినీ ప్రజలతో తాను షేర్ చేసుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అంతేకాదు సామాన్యుడి బాగు కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ కార్యక్రమాలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా వెల్లడించానని మనసు విప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ప్రజలు వినేలా ఏర్పాట్లు చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. దేశ ప్రజలకు చేరువ కావడానికి మన్ కీ బాత్ కార్యక్ర మాన్ని ఒక వేదికగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ మహత్తర కార్యక్రమంలో జాతీయ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు అందరినీ భాగస్వాములను చేసింది కమలం పార్టీ. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ నిర్వహణ ఏర్పాట్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా పర్యవేక్షించారు. ఎవరెవరిని పిలవాలి. ఎక్కడ ఎవరికి సీటింగ్ అరేంజ్ చేయాలి వంటి అన్ని అంశాలను నడ్డా దగ్గరుండి చూసుకున్నారు. వందో ఎపిసోడ్ నిర్వహణ లో రవ్వంత లోపం కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు జేపీ నడ్డా. ఒక్కమాటలో చెప్పాలంటే మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమలం పార్టీ.
వందో ఎపిసోడ్ కార్యక్రమం కేవలం భారతదేశానికే పరిమతం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీ యులందరూ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను వినేలా ఏర్పాట్లు చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ విషయంలో బీజేపీ చరిత్ర సృష్టించింది. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాధురి దీక్షిత్, షాహిద్ కపూర్, రోహిత్ శెట్టి హాజరయ్యారు. వందో ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మనసు విప్పి చెప్పిన మాటలను సినీ తారలు శ్రద్ధగా ఆలకించారు. మన్ కీ బాత్ ప్రసంగాల వెనుక ఓ గొప్ప దార్శనికుడు దాగి ఉన్నారని సినీ ప్రముఖులు కొనియాడారు. మన్ కీ బాత్ వేదిక ద్వారా మూరుమూల ప్రాంతాలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేరువ అయ్యారని అభినందించారు సినీ తారలు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 13 వారసత్వ కట్టడాలు కాంతులీనాయి. ఈ వారసత్వ కట్టడాల దగ్గర ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోల వంటి ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఆయా కట్టడాల గొప్పతనాన్ని, చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియచేసే వివరాలను ప్రదర్శించారు. ఈ జాబితాలో ఎర్రకోట, గేట్ వే ఆఫ్ ఇండియా, గోల్కొండ కోట తదితర చారిత్రక కట్టడాలు ఉండటం విశేషం.మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పురస్కరించుకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో ప్రధాన నరేంద్ర మోడీ ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను చూడటానికి సందర్శకులు పోటెత్తారు. మొత్తానికి మన్ కీ బాత్ ప్రస్థానంలో వందో ఎపిసోడ్ తన ప్రత్యేకతను చాటుకుంది.