తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నిరాశపరిచింది. విద్యుత్తు కమిషన్ పై వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ కేసీఆర్ పిటీషన్ వేశారు. ఈ కమిషన్ విచారణను నిలుపుదల చేయాలంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నరసింహారెడ్డి విచారణ చేపట్టకముందే మీడియా సమావేశం పెట్టి వివరాలను వెల్లడించడాన్ని కేసీఆర్ తరుపున న్యాయవాదులు తెలిపారు. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ మేరకే కమిషన్ ను ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆయన పిటీషన్ ను కొట్టివేసింది.
హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు
0
224
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


