35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

నందగిరి, హుడా ఎంక్లేవ్ లేఅవుట్ పార్కుల కబ్జాపై హైడ్రా కమిషనర్‌ ఆరా

హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్, హుడా ఎన్‌క్లేవ్‌ కాలనీలతో పాటు గురుబ్రహ్మనగర్ బస్తీలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. జూబ్లీహిల్స్ నందగిరి, హుడా ఎంక్లేవ్ లేఅవుట్ పార్కుల కబ్జా, అక్కడే వున్న గురుబ్రహ్మనగర్ బస్తీ ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురుబ్రహ్మనగర్ బస్తీ ప్రాంతంలో డబుల్‌ బెడ్‌ రూంలు నిర్మించేందుకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో బస్తీని ఆనుకుని ఉన్న పార్కు స్థలాలను కొంతమంది ఆక్రమణదారులు కబ్జా చేస్తున్నారని నందగిరిగిల్స్, హుడా ఎన్‌క్లేవ్‌ వాసులు కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు.

మొత్తం ఈ వ్యవహారంలో డీజీపీస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్) ద్వారా సర్వే చేయించి నిర్ధారించుకున్న తర్వాత విచారణ చేపడతామని కమిషనర్ హమీ ఇచ్చారు. బాధ్యలందరినీ పిలిపించి వారి వద్ద వున్న ఆధారాలను కూడా తనిఖీ చేస్తామని కమిషనర్ చెప్పారు.

దాదాపు రెండు గంటలపాటు మొత్తం గురుబ్రహ్మ నగర్ బస్తీతో పాటు నందగిరి కాలనీ, హుడా ఎనక్లేవ్ కాలనీలతో పాటు అక్కడ ప్రభుత్వ స్థలాలు, పార్కులను హైడ్రా కమిషనర్ ఇతర అధికారులతో కలసి సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఈ పర్యటనలో పాల్గొని వివరాలు అందించారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్