స్వతంత్ర, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మొత్తానికి ఓ ఇంటివాడు అయ్యాడు. శనివారం రాత్రి రక్షితారెడ్డి మెడలో మూడుముళ్లు వేశారు. జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శర్వా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్, సిద్దార్థ్, ఆదితిరావు హైదరీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన న్యాయవాది మధుసూదన్‌రెడ్డి, సుధారెడ్డి దంపతుల కూతురు అయిన రక్షితా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో సక్సెస్ కొట్టిన శర్వానంద్ త్వరలోనే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కున్న చిత్రంలో హీరోగా నటించనున్నాడు.