కీలక దశకు జ్ఞానేశ్వరి కేసు దర్యాప్తు

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఘటన జరిగి పది రోజులు గడిచిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా గ్రామానికి చేరుకుని చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నామని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు కొనసాగుతోందని తెలిపారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ, ఇప్పటివరకు చేపట్టిన గాలింపు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, పోలీసు ప్రత్యేక బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి జంతువుల బారిన పడిందా..? లేక ఎవరైనా తీసుకెళ్లారా..? అనే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. చిన్నారి సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు రివార్డు ప్రకటించడం జరిగింది అని తెలిపారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్