ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పదే పదే కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పవన్ కించపరచడం ఇదేం కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కలను కాంగ్రెస్ సాకారం చేసిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ, బీజేపీ నేతలు కించపరుస్తున్నారన్నారు. బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా మాట్లాడటానికి ఇదేమీ సినిమా కాదని.. ఎంతో మంది అమరులైతే, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు చూడనిదే పవన్ సినిమాలు ఆడాయా? ఇంత పెద్ద హీరోవు అయ్యావా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
0
37
Previous article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


