స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సాయానికి అదనంగా ఈ పరిహారం ఇవ్వాలని సూచించారు. కాగా బాలాసోర్‌లో గురుమూర్తి ఉంటుండగా.. పెన్షన్ కోసం స్వస్థలం వచ్చి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన బాధితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు.