MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించే అంశంపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. ఈ కేసును జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎమ్మెల్సీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిపించి ఈడీ విచారణ జరిపించే విషయంలో… గతంలో నళిని చిదంబరం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్… నిందితురాలు కానప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ఇచ్చిన ఈడీ సమన్లను రద్దు చేయాలని, ఇంటి వద్దే విచారణ జరపాలని కోరారు. వాదోపవాదాలు విన్న అనంతరం కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం న్యాయస్థానం తెలిపింది.
Read Also: సీఎం అని అరిస్తే సరిపోదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు ఫైర్
Follow us on: Youtube , Instagram