Naga Babu |గ్లోబల్ స్టార్ రాంచరణ్ బర్త్ డే వేడుకలను హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఫ్యాన్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై నాగబాబు మాట్లాడుతుండగా.. కొంత మంది ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు.. కాస్త ఆగండి.. చరణ్ బర్త్ డే వేడుకలు చేస్తున్నాం కాబట్టి.. ముందు చెర్రీ గురించి మాట్లాడదామని అన్నారు. అయినా కానీ ఫ్యాన్స్ మాత్రం ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేయడంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. ‘సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలని చెప్పారని గుర్తుచేశారు. కాబట్టి ‘సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎన్నికల్లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి.. అది పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’ అని నాగబాబు(Naga Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.