స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల డెంగీ బారినపడి వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ లకు దూరమైన టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కోలుకున్నాడు. అంతేకాదు, నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు. టీమిండియాకు నిజంగా ఇది శుభవార్తే. ఈ నెల 14న టీమిండియా అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ నాటికి గిల్ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. డెంగీ కారణంగా ప్లేట్ లెట్లు తగ్గడంతో, గిల్ కు అందుకు తగిన చికిత్స అందించారు. గిల్ ఇప్పుడు బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తున్నప్పటికీ పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. దాంతో, పాకిస్థాన్ పై అతడు బరిలో దిగే అవకాశాలు స్వల్పమే. పాక్ తో పోరు తర్వాత టీమిండియా వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర జట్లతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, పాక్ తో మ్యాచ్ కు గిల్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియాకు శుభవార్త… బ్యాటింగ్ ప్రాక్టీసు ప్రారంభించిన శుభ్ మన్ గిల్
0
368
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


