ప్రజా యుద్దనౌక గద్దర్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. గద్దర్‌కు.. LTTE తీవ్రవాదులకు పెద్ద తేడా లేదన్నారు. వందల మంది ప్రాణాలు, వేలమంది యువకులు దారి తప్పడానికి గద్దర్ సిద్ధందాలే కారణమని ఆరోపించారు. గద్దర్ లాంటి మాజీ మావోయిస్టు గద్దర్‌కు ఏ హోదాలో అవార్డులు అడుగుతున్నారని ఆయన నిలదీశారు. తక్షణమే LTTE రికమెండేషన్ చేస్తే ఎంత అపహాస్యంగా ఉంటుందో.. కాంగ్రెస్ పార్టీ గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వమడంలో పెద్ద తేడా ఏం లేదని చెప్పారు. LTTE తీవ్రవాదులకు కూడా పద్మ శ్రీ,, పద్మ విభూషన్, భారతరత్న ఇవ్వమని అడుగుతారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.