ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వేసిన ఏపీ హైకోర్టు న్యాయవాది బీ బాలయ్య తరఫు లాయర్‌పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పనికిమాలిన పిటిషన్ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్కమాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ పిటిషన్‌పై వాదించడానికి ఎలా వచ్చారని లాయర్ మహేంద్రసింగ్‌ను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.
చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని బాలయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నారని కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక్క మాట కూడా వినకుండానే ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అంటూ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆయనపై సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలని బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సీనియర్ లాయర్ మహేందర్ సింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకు రాగా..ఆయనపై కూడా జస్టిస్ త్రివేది తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమాన విధిస్తామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను వాదించేందుకు మీలాంటి సీనియర్ న్యాయవాది ఎలా వచ్చారని కూడా ప్రశ్నించారు. వెంటనే ఆ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.