బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి బెంగళూరులో ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను అత్యవసరంగా ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమి షాలకే ఇంజిన్‌లో మంటల గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చేరవేశారు. ఆ వెంటనే పూర్తిస్థాయి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి వచ్చింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే అగ్నిమాపక సిబ్బందిని రన్‌వేపై మోహరించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపినట్టు బెంగళూరు విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణంపై దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు.
ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
0
164
Previous article
Next article
Latest Articles
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -
- Advertisement -


