తెలుగు రాష్ట్రాల్లో ప్రలోభాల పర్వం

     రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే తెరపెడింది. నిబంధనల మేరకు నిన్నటి నుంచే రాజకీయ నాయకుల మైకులు మూగబోయినా, ప్రలోభాలు మాత్రం ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. మద్యం, నగదును జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఎలక్షన్‌ కాక పెరిగిపోవడంతో అంతే స్థాయిలో నోట్ల కట్టలు కూడా తెగుతు న్నాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో పార్టీలు తలమునకల య్యా యి.

ఇక ఖమ్మంలో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు ఎన్నికల విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా దేవుని తండా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ ఇన్నోవా కారు వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు పది కిలోమీటర్లు చేజింగ్ చేస్తున్న క్రమంలో ఆ కారు పల్టీకొట్టింది. అందులు కోటిన్నర రూపాయలు బయటపడ్డాయి. మెదక్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, రామచంద్రాపురం లో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. చేతిలో ఓటరు జాబితా పట్టుకుని తిరుగుతున్న వారు జేబుల్లో నోట్ల కట్టలు పెట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్ని స్తుండగా కొందరు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దొరికిన వారు బీఆర్ఎస్‌కు చెందినవారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  ఇక ఏపీలోనూ డబ్బును మంచినీళ్లలా పంచుతున్నారు నాయకులు. ఓటుకు 3వేల నుంచి 10వేల వరకు పంచుతు న్నట్లు తెలుస్తోంది. అటు పోలీసుల తనిఖీల్లో భాగంగా భారీగా డబ్బు పట్టుపడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. నిన్న తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, ఈ వాహనంలో తవుడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా, ఊహించని విధంగా ఆ బస్తాల మధ్యలో అట్ట పెట్టెల్లో పెట్టి తరలిస్తోన్న నోట్ల కట్టలు బయటప డ్డాయి. మొత్తం ఏడు బాక్సుల్లో నగదు బయటపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్