23.2 C
Hyderabad
Tuesday, December 5, 2023
spot_img

టీడీపీలో ఉత్కంఠ.. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్ 30వ తేదీన లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రింగ్ రోడ్డు కేసు విచారణలో 41ఏ సెక్షన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఏపీ హైకోర్టుకు సీఐడీ తెలిపిన సంగతి తెలిసిందే. విచారణకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని తొలుత కోర్టు దృష్టికి తీసుకొస్తామని… ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తామని కోర్టుకు తెలిపారు.

ఇదే కేసులో చంద్రబాబు, పి.నారాయణ తదితరులను కూడా సీఐడీ నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ14గా పేర్కొన్నారు. మరోవైపు, చంద్రబాబు రిమాండ్ కు వెళ్లిన తర్వాత ఏపీకి లోకేశ్ తొలిసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్