చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద TPCC చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను రాజకీయంగా ఆరోపణలు చేశానే తప్ప.. ఎక్కడా రేవంత్ పేరు ప్రస్తావించలేదన్నారు. విద్యార్థి నేతగా ఉన్నప్పుడే రెండు సార్లు జైలుకు వెళ్లానన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లారని.. ప్రజల కోసం కాదని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డితో తనకు పోలికేంటి అని ఎద్దేవా చేశారు.
వీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని.. కంటతడి పెట్టుకుంటూ కూడా సంస్కారహీనంగా రేవంత్ మాట్లాడారని ఈటల విమర్శించారు. కాగా మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25కోట్లు ఇచ్చిందని ఈటల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మండిపడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ డబ్బులు తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.