Delhi liquor policy | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ సప్లమెంటరీ ఛార్జి షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జి షీట్ లో ముగ్గురి పేర్లను ఈడీ పేర్కొంది. ఛార్జిషీట్ లో నిందితులుగా మాగుంట రాఘవరెడ్డి, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పేర్లను మెన్షన్ చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై నేడు సీబీఐ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ విచారణపై నేడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.