ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
జనవరి 10న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17 గా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20. అలాగే ఫిబ్రవరి 5 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8 వ తేదీన ఢీల్లి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.
దేశ రాజధానిలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 13వేల 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపరు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.