25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

తెలుగు రాష్ట్రాల్లో నేరాలు, ఘోరాలు- క్రైమ్‌ రౌండప్‌

మొవ్వ సబ్ రిజిస్టార్ సస్పెన్షన్‌

ఏపీ రాజధాని ప్రాంతంలోని భూముల నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మొవ్వ సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా మొవ్వ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రాజధాని ప్రాంత భూములకు సబ్ రిజిస్ట్రార్‌ నకిలీ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి లోకేష్ ఆఫీసు బృందం ఆరా తీయడంతో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

హిట్‌ అండ్‌ రన్‌ కేసు

రంగారెడ్డి జిల్లా నార్సింగీలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళ్తున్న కొవూరి శ్రీనివాస్‌ అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో స్పాట్‌లోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పొట్ట చేత పట్టుకొని కుటుంబంతో హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్..రాత్రి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సీసీ టీవీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

బెదిరించి.. జారి పడి .. మృతి

మద్యం మత్తులో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేసి, పట్టుతప్పటంతో పై నుండి జారి పడి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. హనుమాన్ నగర్‌కు చెందిన యతిరాజ్ చంద్రశేఖర్ అనే యువకుడు స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా చేశాడు. మద్యం షాప్ దగ్గర తనతో కొందరు దురుసుగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇక్కడి నుంచి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినలేదు, అంతలోనే పట్టు జారీ క్రింద పడిపోయి త్రీవంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

బట్టలు విప్పి ర్యాగింగ్‌

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. చక్రధర్ అనే 8 వ తరగతి విద్యార్థి బట్టలు విప్పి, సిగరెట్ తాగాలంటూ ర్యాగింగ్ చేసి హింసించారు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల. ర్యాగింగ్ విషయం 10 వ తరగతి విద్యార్థి నిఖిల్.. ప్రిన్సిపాల్ కు చెప్పినందుకు ఆవేశంతో విద్యార్థి నిఖిల్ ను చితకబాదారు. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు.

అఘోరి ఆత్మహత్యాయత్నం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లేడీ అఘోరీ హల్ చల్ చేసింది. మహిళలను రాజేష్‌నాధ అఘోరి లైంగికంగా వేదిస్తున్నారంటూ నాగసాధు, లేడీ అఘోరి ఆరోపించింది. తణుకుకు చెందిన రాజేష్‌నాధ్ అగోరి అంతు చూస్తానని లేడీ అఘోరి వార్నింగ్ కూడా ఇచ్చింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్‌నాథ్‌ అఘోరి ఇంటి ముందు లేడీ అఘోరీ ఆందోళన చేపట్టింది. అఘోరి ముసుగులో రాజ్‌నాద్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని లేడీ అఘోరి ఆరోపించింది.

విశాఖలో బైక్ రేసింగ్, ప్రమాదకర స్టంట్లు

విశాఖపట్నంలో బైక్ రేసింగ్ చేస్తూ ప్రమాదకర స్టంట్లు చేస్తున్న 38 బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. విశాఖ ఈస్ట్ జోన్ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. మొదటిసారి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 10 వేల జరిమానా, రెండో సారి దొరికితే 3 నెలల జైలుశిక్ష, మూడో సారి దొరికితే ఏడాది పాటు జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సిందే అని పోలీసులు తెలిపారు. విశాఖలో ర్యాష్ డ్రైవింగ్ కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.

ప్రాణం తీసిన ఇన్‌స్టా పరిచయం

ఇన్‌స్టాలో పరిచయమైన అబ్బాయి కోసం ఇళ్లు విడిచి వచ్చిన బాలిక విగతజీవిగా మారింది. ఏపీలోని కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన మున్నాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 3 నెలల క్రితం ఆ యువకుడితో కలిసి ఇంట్లో నుంచి వచ్చేసింది. మున్నా స్వగ్రామానికి రాగా… అతడి ఇంట్లో వాళ్లు వీరి పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లికి ఇంట్లో వాళ్లు నిరాకరించడంతో మోత్కూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. మూడు నెలల నుంచి అక్కడే ఉన్నారు. బాలిక మేజర్ అయ్యేందుకు మరో రెండు నెలల సమయం ఉండటంతో… ఆతర్వాతే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈలోగానే నిన్న రాత్రి తాము ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డబ్బుల కోసమే తమ కుమార్తెను మున్నా వేధించి చంపాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఫుట్‌పాత్‌పై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు

తెల్లాపూర్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేశాడు తనయుడు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని డివినో విల్లాస్‌లో తాగుడుకు బానిసైన కార్తీక్ రెడ్డి.. తల్లి రాధికపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన రాధికను హుటాహుటిన నల్లగండ్లలోని సిటిజెన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక మృతిచెందింది. ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసైన కార్తీక్ రెడ్డి తరుచూ కుటుంబసభ్యులతో ఆస్తి కోసం గొడవపడే వాడని… ఇవాళ ఉదయం సైతం ఘర్షణకు దిగి కత్తితో ఈ దారుణానికి పాల్పడ్డాడు కార్తీక్ రెడ్డి.

భారీగా గంజాయి స్వాధీనం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు. ఇద్దరు యువకుల అరెస్టు చేసి విచారణ చేపట్టారు. చేవెళ్లలో గంజాయి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఉప్పల్‌కి చెందిన సాయి అరుణ్, చేవెళ్లకి చెందిన రిజ్వాన్‌పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

దూసుకెళ్లిన కారు.. చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో విషాదం నెలకొంది. ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులపైకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక చిన్నారి అక్కడికక్కడే చనిపోగా… మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

9 కిలోల వెండి చోరీ

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్టీమర్ రోడ్డులో రాత్రి వేళ దొంగలు ఇంట్లో ప్రవేశించి వెండి వస్తువులు దోచుకెళ్లారు. యల్లాప్రగడ వెంకటరత్నం ఇంటి తాళం పగలకొట్టిన దొంగలు సుమారు 9 కేజీల వెండి వస్తువులు ఎత్తుకుపోయారు. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు విజయవాడలో ఉన్న వెంకటరత్నానికి తెలిపారు. వెంటనే వెంకటరత్నం ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీవేద, సీఐ యాదగిరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రపిస్తున్నటు తెలిపారు.

కుక్కల స్వైర విహారం

కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో కుక్కలు స్వైర విహారం చేశాయి. స్టేడియంలో ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కుక్కలు స్వైర విహారం చేయడంతో అధికారులు భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. కుక్కలను పట్టుకునేందుకు మున్సిపల్ అధికారులు వాటి వెనుక పరుగులు తీస్తూ అష్టకష్టాలు పడ్డారు. చివరికి రెండు కుక్కలను పట్టుకొని తీసుకెళ్లారు.

పెళ్లి ఊరేగింపులో యువకుల మధ్య వాగ్వాదం

నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలో పెళ్లి ఊరేగింపులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది. పెళ్లి ఊరేగింపులో శ్రీకర్, రాజు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీకర్‌పై రాజు కత్తితో దాడి చేశాడు. శ్రీకర్ తలలోకి కత్తి దూసుకెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. మెరుగైన వైద్యం కోసం మళ్లీ శ్రీకర్‌ను నిజామాబాద్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మూగ జీవాల అక్ర‌మ ర‌వాణా

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో మూగ జీవాల అక్ర‌మ ర‌వాణా మ‌ళ్లీ మొద‌లైయింది. కొంతకాలం పోలీసుల‌ విస్తృత త‌నిఖీలు, విస్తృత చ‌ర్య‌ల‌తో మౌనం వ‌హించిన మూగ జీవాల‌ అక్ర‌మ ర‌వాణా దారులు, అదును చూసి మ‌ళ్లీ మూగ‌జీవాల అక్ర‌మ ర‌వాణా షురూ చేశారు. చర్ల నుండి నూగూరు, వెంక‌టాపురం, వాజేడు, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవింద‌రావుపేట‌, ములుగు మండ‌లాల మీదుగా హైద‌రాబాద్‌లోని కబేళాల‌కు రోజు రాత్రి స‌మ‌యంలో మూగ జీవాల అక్ర‌మ ర‌వాణా యథేచ్చగా కొన‌సాగుతోంది. మూగ జీవాల‌ను ర‌వాణా చేయ‌డానికి అశోక్ లీ ల్యాండ్‌, బొలెరో, డీసీఏం, కంటైన‌ర్, లారీ వంటి వాహ‌నాల‌ను వాడుతూ అక్ర‌మ ర‌వాణా య‌థేచ్చ‌గా కొన‌సాగిస్తున్నారు. మూగ జీవాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించే క్ర‌మంలో చూసేవారికి అనుమానం రాకుండా, అక్ర‌మ రవాణాదారులు వాహ‌నాలకు ప్ర‌త్యేక మార్పులు చేసి చెక్‌పోస్టుల మీదుగా మూగ‌జీవాల‌ను దర్జాగా క‌బేళాల‌కు త‌ర‌లిస్తున్నారు.

యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

కర్టాణక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మరణించగా… మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటీవల ప్రారంభమైన కేజీఎఫ్ – మాలూరు ఎక్స్ ప్రెస్ గ్రీన్‌వేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కదిరిగాని కుప్పం గ్రామానికి చెందిన సీనప్పని ఆస్పత్రిలో చేర్పించి… ఆయన కుమారుడు మహేశ్ సహా కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణం అయ్యారు. కేజీఎఫ్-బంగారుపేట మధ్యన ఎదురుగా లైట్లు లేకుండా రావడంతో ప్రమాదవశాత్తు కారు బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తితో పాటు కారులోని మహేశ్ సహా ఓపాప, మహిళ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సుజాత, సుమిత్ర, మరో బాలుడిని కోలార్ మెడికల్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్