దేవర 2 లో నటించే బాలీవుడ్ స్టార్ ఎవరు..?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన దేవర ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. దీంతో దేవర 2 పై మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే.. ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీతో వార్ 2, ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండడంతో అసలు దేవర 2 ఉందా..? లేదా అనే డౌట్ కూడా మొదలైంది. అయితే.. దేవర 2 ఉందని.. ఇందులో బాలీవుడ్ స్టార్ నటించనున్నాడని టాక్. ఇంతకీ.. దేవర 2 లో నటించే బాలీవుడ్ స్టార్ ఎవరు..?

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర పాన్ ఇండియా రేంజ్ లో ఎంత వరకు మెప్పిస్తుందో అనుకుంటే.. 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలన విజయం సొంతం చేసుకుంది. అయితే.. మూవీకి ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ.. 500 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. డివైడ్ టాక్ తోనే 500 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. 1000 కోట్లు కలెక్ట్ చేసేదేమో అని వార్తలు వచ్చాయి. దేవర 2 ఉండదేమో అని ప్రచారం జరిగింది కానీ.. కొరటాల ఈసారి అదిరిపోయేలా దేవర 2 కథను రెడీ చేస్తున్నారని సమాచారం.

దేవర పార్ట్-2 స్క్రిప్ట్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని.. ముఖ్యంగా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకోవడం కోసం ఈ మూవీలో హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ పాత్ర చేయించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తన తర్వాత దేవర 2ను స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. జాన్వీ పాత్ర పార్ట్ 1 లో అంతగా చూపించలేదు.. ఇప్పుడు పార్ట్ 2 లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలిసింది. త్వరలోనే దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా అఫిషియల్ గా పూర్తి వివరాలతో క్లారిటీ ఇవ్వనున్నారని తెలిసింది. ప్రచారంలో ఉన్నట్టుగా దేవర 2 లో రణ్‌ వీర్ సింగ్ నటిస్తే.. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్