Cricket: వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా అవతరించిన పాకిస్థాన్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో నెంబర్ వన్ గా అవతరించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్ తో తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ను పాక్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టాపర్ గా నిలిచింది. ఐసీసీ క్యాలెండర్ ఏడాదిలో పాక్ 23 మ్యాచ్ లు ఆడి 118 రేటింగ్ సాధించింది. 

బాబర్ అజామ్ కెప్టెన్సీ చేపట్టాక పాకిస్థాన్ జట్టు ఆటతీరు అనూహ్యరీతిలో మెరుగుపడింది. సొంతగడ్డపైనా, బయటా విజయాలు సాధిస్తూ ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకింది. అక్టోబరులో భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరడం పాకిస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచనుంది.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్